భారతదేశం, మార్చి 13 -- Kuwait Suicide: అన్న‌మ‌య్య జిల్లా రైల్వే కోడూరు ప‌ట్ట‌ణంలోని రంగ‌నాయ‌కుల పేట‌కు చెందిన కొల్లా శ్రీ‌నివాసులు (38) కువైట్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కుటుంబ స‌భ్యులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం రైల్వే కోడూరు ప‌ట్ట‌ణంలోని రంగ‌నాయ‌కుల పేట‌లో కొల్లా శ్రీ‌నివాసులు, అన్న‌పూర్ణ దంప‌తులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.

కువైట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాసులు కుటుంబ క‌ష్టాలు, అప్పుల బాధలు త‌ట్టుకోలేక కొల్లా శ్రీ‌నివాసుల కుటుంబం కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక‌ ఇబ్బందులు ప‌డుతోంది. ఏం చేయాలో తెలియ‌క కుటుంబం స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతోంది. అయితే అప్పుడే కువైట్ వెళ్లి డ‌బ్బులు సంపాదించి అప్పులు తీర్చొచ్చ‌ని ఆలోచ‌న శ్రీ‌నివాసులకు వ‌చ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ‌ క‌ష్టాలు గ‌ట్టెక్కుతాయ‌ని భావిం...