హైదరాబాద్​, Oct. 24 -- బెంగళూరు హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 20మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఘటనకు సంబంధించి వెలువడుతున్న దృశ్యాలు, వార్తలు అత్యంత భయాకనంగా ఉన్నాయి.

అగ్నికి ఆహుతైన బస్సు- పుర్రెలే మిగిలాయి! హైదరాబాద్​ నుంచి గురువారం రాత్రి ఓ ప్రైవేట్​ ట్రావెల్​ బస్సు బెంగళూరుకు బయలుదేరింది. బస్సులో 40మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్టు సమాచారం. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కర్నూల్​ జిల్లాలోని చిన్నటేకూరుకు సమీపంలో ఈ ఏసీ బస్సు ఒక ద్వీచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ బండి బస్సు కింద ఇరుక్కుపోయింది. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. కొంత సేపటికే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది.

ఘటనా స్థలం నుంచి వెలువడుతున...