భారతదేశం, ఏప్రిల్ 10 -- Kondagattu: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామికి ఏటా రెండుసార్లు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఏటా చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ చిన్న జయంతిని వైశాఖ బహుళ దశమి పూర్వాభద్ర నక్షత్రం రోజున పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహి స్తారు.

కొండగట్టులో చిన్న జయంతి నుంచి పెద్ద జయంతి మధ్య 41 రోజుల వ్యవధి ఉంటుంది. ఈనెల 11 నుంచి మూడు రోజుల పాటు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు లక్ష మందికి పైగా హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టును సందర్శించనున్నారు.

అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ ఇప్పటికే రెండు సార్లు జిల్లా అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపద్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా చలవపందిళ్ళు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని...