Hyderabad, జనవరి 23 -- పులిహోరలో కరివేపాకులు వేస్తారు, కానీ కరివేపాకులతోనే పులిహోర చేసి చూడండి. ఎంత రుచిగా ఉంటుందో. పైగా కరివేపాకుల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కరివేపాకు పులిహోరను చేయడానికి చాలా తక్కువ సమయం సరిపోతుంది. ఇది చూడటానికి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాబట్టి తినడానికి కూడా రుచిగా అనిపిస్తుంది. నోటికి కమ్మగా కరివేపాకు పులిహోర ఎలా చేయాలో తెలుసుకోండి.

వండిన అన్నం - రెండు కప్పులు

నూనె - మూడు స్పూన్లు

కరివేపాకులు - ఒక కప్పు

ఆవాలు - మూడు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

పచ్చిశనగపప్పు - ఒక స్పూను

వేరుశెనగ పలుకులు - పావు కప్పు

ఎండుమిర్చి - ఐదు

పచ్చిమిర్చి - ఐదు

చింతపండు - నిమ్మకాయ సైజులో

ఉప్పు - రుచికి సరిపడా

వెల్లుల్లి రెబ్బలు - రెండు

పసుపు - అర స్పూను

ఇంగువ - చిటికెడు

1. అన్నాన్ని ముందుగానే వండుకుని పొ...