భారతదేశం, ఫిబ్రవరి 4 -- Karimnagar Murder: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో గత నెల 27 మహిళ మమత హత్యకు గురి కాగా, 4 ఏళ్ళ బాలుడు అద్యశ్యం మిస్టరీని పోలీసులు చేధించారు. హంతకుడు బాలుడిని చెన్నైలో ఓ హోటల్ వదిలి పారిపోగా బాలుడిని పోలీసులు చేరదీసి కరీంనగర్ కు తరలించారు. కరీంనగర్ రూరల్ ఏసిపి శుభం ప్రకాష్ సమక్షంలో బాలుడిని నానమ్మ తాతయ్య మేడ లక్ష్మీ రాంచందర్ దంపతులకు అప్పగించారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఖాసీంపేట కు చెందిన భరత్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన నర్సింగ్ స్టూడెంట్ మమత ప్రేమించుకున్నారు. ఆరేళ్ళ క్రితం ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. వారికి ధ్రువ అనే బాబు జన్మించాడు. అన్యోన్యంగా సాగిన దాంపత్య జీవితంలో తర్వాత కలతలు మొదలయ్యాయి.

గత ఏడాది దసరా పండుగ నుంచి మమత భర్త భరత్ కు దూరంగా కొడుకుతో కలిసి మంచిర్యాలలో ఉండే...