భారతదేశం, జనవరి 29 -- Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణ సంఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది. బాలిక‌కు ప్రేమ పేరుతో వ‌ల వేసి, పెళ్లి చేసుకున్నాడో యువకుడు. అనంత‌రం ఇంటికి తీసుకెళ్లి వ్యభిచారం చేయాల‌ని మైనర్ పై భ‌ర్త, అత్త ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి ప్రతిఘ‌టించిన బాలికను తీవ్ర ఇబ్బందులు పెట్టారు.

బాలిక మానసికంగా కుంగిపోవడంతో విశాఖ‌ప‌ట్నంలోని విమ్స్‌లో చికిత్స అందించారు. అప్పటికీ బాలిక పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోయేసరికి మానసిక వైద్యశాలలో చేర్చారు. ఈ ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఎన్టీఆర్‌ కాల‌నీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దాపురం ఎన్టీఆర్ కాల‌నీకి చెందిన యువ‌కుడు చందుకి, అన‌కాప‌ల్లికి జిల్లాకు చెందిన బాలిక (17) కొంత కాలం క్రితం తుని రైల్వే స్టేష‌న్‌లో ప‌రిచ‌యం అ...