భారతదేశం, ఏప్రిల్ 1 -- Kakinada Crime: కాకినాడలో కట్టుకున్న భార్యపై అనుమానంతో దారుణంగా హత్య చేసి మంచం కింద దాచిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న కాకినాడ జిల్లాలో తొండంగి మండ‌లం య‌ర్ర‌య్య‌పేట పంచాయ‌తీ కొత్త‌పేట‌లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం కాకినాడలోని దుమ్ముల‌పేట‌కు చెందిన గోస‌ల దార‌కొండ‌తో య‌ర్ర‌య్య‌పేట‌కు చెందిన చొక్కా భూలోకం, కొండ‌మ్మ‌ల రెండో కుమార్తె చొక్కా ప‌ద్మ (34)కు దాదాపు ప‌దేళ్ల క్రిత‌మే వివాహం జ‌రిగింది.

వీరికి కుమారుడు సిద్ధు, కుమార్తె లాస్య ఉన్నారు. అయితే దార‌కొండ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. త‌న భార్య ఎవ‌రితోనైనా వివాహేత‌ర సంబంధం పెట్టుకుందోఏమోన‌ని అనుమానంతో ప్ర‌తి రోజూ వేధించేవాడు.

ఈ క్ర‌మంలో మ‌ద్యానికి బానిస అయిన దార‌కొండ భార్య‌ను త‌ర‌చూ వేధించ‌డంతో పాటు కొట్టేవాడు. ఈ క్ర‌మంలో భ‌ర్త నుంచ...