భారతదేశం, ఫిబ్రవరి 3 -- మనం ఆన్‌లైన్‌లో చూస్తుంటాం.. బై వన్.. గెట్ టు అని. లేకపోతే భారీ డిస్కౌంట్, ఆఫర్ సేల్ వంటి ప్రకటనలు చూస్తుంటాం. కొన్నిసార్లు క్లియరెన్స్ సేల్ అని తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తారు. ఇవన్నీ కామన్. కానీ కాకినాడలో ఓ మద్యం వ్యాపారీ వినూత్నంగా ఆలోచించాడు. లిక్కర్ సేల్స్ పెంచుకోవడానికి ఊహించని ఆఫర్ ఇచ్చాడు. దీంతో మందుబాబులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కాకినాడలోని వినాయక వైన్స్ నిర్వాహకులు వినూత్న ఆఫర్ ప్రకటించారు. మందు తాగండి .. థాయ్​లాండ్​ వెళ్లండి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తమ దుకాణంలో అన్నిరకాల బ్రాండ్లు దొరుకుతాయని.. మద్యం కొన్న వారికి టోకెన్లు ఇస్తామని ప్రకటించారు. కావాల్సిన బ్రాండ్​‌ను తాగడమే కాదు.. ఫ్రీగా థాయ్​లాండ్​ వెళ్లే అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ ఆఫర్ ఇచ్చారు.

మందుబాబులు తమ షాపులో లిక్కర...