భారతదేశం, మార్చి 25 -- Jagityala Crime: జగిత్యాలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని గ్రామస్తులు బంధించి తనిఖీలు చేయడంతో వారి వద్ద నాటు తుపాకీ బయటపడింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గ్రామాల్లో అనుమానంగా తిరిగే వారిపై పోలీసులతో పాటు గ్రామస్తులు నిఘా పెట్టారు. గస్తీ లో ఉన్న రాయికల్ మండలం రామోజీపేట గ్రామస్తులకు ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. దొంగలుగా బావించిన గ్రామస్థులు వారిని చాకచక్యంగా పట్టుకుని బందించి దేహశుద్ధి చేయడంతో నాటు తుపాకీ బయటపడింది. తుపాకీ తోపాటు బుల్లెట్లు బయటపడ్డాయి. భయాందోళనలకు గురైన గ్రామస్థులు ఇద్దరిని పోలీసులకు అప్పగించారు.

జగిత్యాలలో నాటు తుపాకీతో రామోజీపేటలో సంచరించిన ఇద్దరు యువకులు బీహార్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తుపాకీతో ఈ ప్రాంతాని...