భారతదేశం, మార్చి 12 -- Jagityala Crime: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మెట్ పల్లి మండలాల్లో గత కొంత కాలంగా అక్రమ ఇసుక రవాణాతో పాటు భూమి సెటిల్మెంట్ దందాలు చేస్తూ ఎదిరించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించిన ముగ్గురిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు సెల్ ఫోన్లు, 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మీడియా సమక్షంలో వారిని చూపించి మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మెట్ పల్లి మండలం రాజేశ్వరరావు పేట కు చెందిన రెంజర్ల అజయ్, మెట్ పల్లి కి చెందిన బత్తుల భరత్, జెట్టి లక్ష్మణ్ ముగ్గురు ముఠాగా ఏర్పడి అక్రమ దందాకు తెరలేపారు.

నిందితులు మెట్‌పల్లిలో అక్రమంగా ఇసుక రవాణా చేయడమే కాకుండా సెటిల్మెంట్ దందాలు చేస్తూ అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేశారు. చెప్పినట్టు ఎవరైన వినకపోతే వా...