భారతదేశం, ఏప్రిల్ 7 -- IRCTC Special: భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు ఏప్రిల్‌ 23న బయల్దేరుతుుంది. విజయవాడ నుంచి బయల్దేరే ఈ యాత్ర పది రోజుల పాటు సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా విజయవాడ నుంచి బయలుదేరే ట్రైన్ గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్ నగర్, బల్లార్షా, వార్దా, నాగపూర్ ల మీదుగా వెళ్తుంది.

https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SCZBG40

భారత్‌గౌరవ్‌ రైలు గురుకృప యాత్రలో భాగంగా విజయవాడ నుంచి ఈ నెల 23న ఉదయం 8 గంటలకు ఈ రైలు బయలు దేరుతుంది. అదే రోజు రాత్రి 8.08 గంటలకు పెద్దపల్లికి చేరుతుంది.

25న ఉదయం 8 గంటలకు హరిద్వార్ చేరుకుంటుంది. సందర్శకులను అక్కడి బస కేంద్రానికి తరలిస్తారు. మానసదేవి ఆలయ దర్శనం, రాత్రి సమయంలో గంగా హారతి అనంతరం రాత్రి బస ఏర్పాటు చేస్తారు.

26న ఉదయం రిషికేష్ చేరుకొని గంగా...