భారతదేశం, ఫిబ్రవరి 13 -- మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ప్రయాణించిన లేదా మీరు చూసిన విమానాలు దాదాపు తెలుపు రంగులోనే ఉంటాయి! వైట్​ కాకుండా వేరే రంగులోని విమానాలను చూడటం చాలా అరుదు! ఇంతకి.. విమానాలు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? ఇక్కడ తెలుసుకుందాము.

అంతేకాదు.. ఈ మధ్యకాలంలో ఆకాశంలో వైట్​ విమానల మధ్య ఒక బ్లాక్​ జెట్​ కనిపించి, అందరిని ఆకర్షిస్తోంది. అది "ఎయిర్​ న్యూజిలాండ్​" సంస్థకు చెందినది. ప్రపంచంలోనే అత్యధికంగా నలుపు రంగు విమానాలను కలిగిన సంస్థగా దీనికి గుర్తింపు ఉంది. అందరు తెలుపు వాడుతుంటే, ఈ సంస్థ నలుపును ఎందుకు ఎంచుకుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఇక్కడ తెలుసుకోండి..

చల్లదనం కోసం: తెల్లటి రంగు సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది. విమానం రన్‌వేపై ఉన్నప్పుడు కేబిన్ లోపల ఉష్ణోగ్రత పెరగకుండా ఇది కాపాడుతుంది. నలుపు రంగు అయితే వేడిని పీల్చు...