భారతదేశం, ఏప్రిల్ 18 -- Infosys Q4 result: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.7,975 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇన్ఫోసిస్ (Infosys) నికర లాభం రూ.6,134 కోట్లుగా ఉంది. అంటే, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, నికర లాభంలో ఇన్ఫోసిస్ 30 శాతం వృద్ధి నమోదు చేసింది.

ఈ క్యూ 4 లో ఇన్ఫోసిస్ ఆదాయం 1.3 శాతం పెరిగి రూ.37,923 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ (CC) పరంగా తమ ఆదాయం ఫ్లాట్ గా ఉందని, క్యూఓక్యూ 2.2 శాతం క్షీణించిందని కంపెనీ తెలిపింది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 20.1 శాతంగా నమోదైంది. ఇది గత సంవత్సరం క్యూ 4 తో పోలిస్తే 0.9 శాతం, క్యూ 3 తో పోలిస్తే 0.4 శాతం క్షీణించింది.

జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తమ సామర్థ్యాలు విస్తరిస్తూనే ఉన్నాయని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ప...