తెలంగాణ,హైదరాబాద్, మార్చి 1 -- సమ్మర్ వచ్చిందంటే చాలు.. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతుంటాయి. గరిష్ట ఉష్ణోగ్రతల దాటికి కొన్నిసార్లు అనుకోని అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. వేసవి కాలంలో పాడైన విద్యుత్ వైర్లు, కార్లతో పాటు మరికొన్ని వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ వేడిమికి కొన్నిసార్లు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. దీంతో ఆస్తి నష్టమే కాదు. ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది.

ఎండాకాలం జాగ్రతలకు సంబంధించి హైడ్రా కీలక సూచనలు చేసింది. ఎండాకాలం అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఇవ్వొద్దని. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్ మని కొండ ప్రాంతంలో పుప్పాలగూడలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో పార్కింగ్ ప్రాంతంలో వున్న రెండు కార్ల దగ్ధమయ్యాయి. రెండంతస్తుల భవనాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయ...