భారతదేశం, ఏప్రిల్ 7 -- అపోలో హాస్పిటల్స్‌ తమ 'హెల్త్‌ ఆఫ్‌ ద నేషన్‌ 2025 (హెచ్‌ఓఎన్‌ -2025)' నివేదికను విడుదల చేసింది. 'లక్షణాల కోసం వేచి చూడకండి-నివారణ ఆరోగ్యాన్ని మీ ప్రాధాన్యతగా మలుచుకోండి' అని సందేశాన్ని ఇచ్చింది. భారతదేశంలో అపోలో హాస్పిటల్స్‌‌లో 25 లక్షల మందికి పైగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

నివేదిక ప్రకారం.. లక్షలాది మంది ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య స్థితిని కలిగి ఉంటున్నారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా 26 శాతం మంది హైపర్‌టెన్షన్‌ కలిగి ఉన్నారు. 23 శాతం మంది మధుమేహం కలిగి ఉన్నారు. నివారణ ఆరోగ్య పరీక్షలు అసాధారణంగా పెరుగుతున్నట్లుగా అపోలో హాస్పిటల్స్‌ స్పష్టం చేసింది. 2019లో పది లక్షలుగా ఉన్న ఈ పరీక్షలు 2024కు వచ్చేసరికి 25 లక్షలకు చేరుకున్నాయి. కేవలం ఐదు సంవత్సరాలలో 15...