భారతదేశం, ఫిబ్రవరి 7 -- Guntur Crime: గుంటూరు జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువ‌తి వెంట‌ప‌డ్డాడు ఒక యువ‌కుడు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించాడు. తీరా పెళ్లి చేసుకోవాల‌ని యువ‌తి కోరితే, తాను ప్ర‌భుత్వ ఉద్యోగిని, త‌న‌కు ఎక్కువ క‌ట్నం వ‌స్తుంద‌ని అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకోక‌పోతే ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మ‌ని యువ‌కుడికి బాధిత యువ‌తి స్ప‌ష్టం చేసింది. దీంతో యువ‌తి చేతిని చాకుతో కోసి, తిన‌మ‌ని ఎలుక‌ల మందు ఇచ్చి ఆత్మ‌హ‌త్య‌కు పురిగొల్పాడు.

ప్రేమికుడు దక్క‌డ‌ని భావించిన యువ‌తి ఆత్మ‌హత్య యత్నానికి పాల్ప‌డింది. స‌మాచారం అందుకున్న‌ యువ‌తి త‌ల్లిదండ్రులు స‌కాలంలో ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీంతో ఆమె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. బాధిత యువ‌తి ఫిర్యాదు మేర‌కు నిందితుడిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లా ప్ర‌త్త...