Hyderabad, ఫిబ్రవరి 13 -- ఫ్రెంచ్ కిస్ అనగానే అది ఫ్రాన్స్‌కు చెందినదేమో అనుకుంటారు. ఫ్రాన్స్‌లో పుట్టిన ముద్దు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేసిందని చెప్పుకుంటారు. నిజానికి ఫ్రెంచ్ ముద్దు వెనుక ఒక సంఘటన ఉంది. ఇదే ఫ్రెంచ్ ముద్దు పుట్టుకకు కారణం.

ప్రపంచ యుద్ధం సమయంలోనే ఈ ఫ్రెంచ్ కిస్ పుట్టింది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నకాలంలో అమెరికా, బ్రిటీష్ సైనికులు ఫ్రాన్స్ లోనే మకాం వేసి ఉండేవారు. చుట్టుపక్కల ఉన్న ఫ్రాన్స్ మహిళలతో వారికి అనుబంధం ఏర్పడింది. ఆ మహిళలు బ్రిటిష్, అమెరికా సైనికుల్లో తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుని ప్రేమించేవారు. అలాగే వారు పెట్టే ముద్దు కూడా వెరైటీగా ఉండేది. అన్నిచోట్లా కేవలం పెదవులు కలిసేటట్టే ముద్దు పెడితే... ఫ్రాన్స్ లోని మహిళలు మాత్రం నాలుకలు కలిసేలా ముద్దు పెట్టుకునేవారు. ఈ పద్ధతి అమెరికా బ్రిటీష్ సైనికులకు చాలా నచ...