తెలంగాణ,హైదరాబాద్, డిసెంబర్ 28 -- ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఏసీబీతో పాటు మున్సిపల్ శాఖ నుంచి వివరాలను సేకరించి ఈడీ. విచారణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా. ఈ కేసులో ఉన్న కేటీఆర్ తో పాటు మిగతా ఇద్దరు అధికారులను విచారించనుంది. ఈ మేరకు కేటీఆర్ కు నోటీసులు జారీ అయినట్లు తెలిసింది.

వచ్చే జనవరి 7వ తేదీన కేటీఆర్ విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి(ఏ3)లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారించనుంది. ఏసీబీ ఎఫ్ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ చట్టం ఈడీ విచారణ చేస్తోంది.

ఫార్ములా ఈరేస్ వ్యవహారంపై ఏసీబీ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేటీఆర్ ను...