భారతదేశం, జనవరి 2 -- ఎక్కువగా విమానాల్లో ప్రయాణం చేసేవారికి ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలనుకునేవారికి కూడా ఈ ఆపర్ ఉపయోగపడనుంది. దేశీయ దిగ్గజ విమాన సంస్థ న్యూ ఇయర్ సేల్ కింద టికెట్లు విక్రయిస్తోంది. దీంతో తక్కువ ధరకే విమాన టికెట్ పొందవచ్చు.

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ న్యూ ఇయర్ సేల్‌లో భాగంగా లైట్ కింద రూ.1,448, వాల్యూ ఆఫర్ కింద రూ.1,599 ఫ్లైట్ ఛార్జీలను ప్రకటించింది. జనవరి 5 వరకు బుకింగ్స్ చేసుకోవచ్చు. పరిమిత సీట్లు, నాన్ రిఫండబుల్ నిబంధనలు ఉన్నాయి. 2025లో ఎంపిక చేసిన ప్రయాణ తేదీల కోసం టికెట్లు బుక్ చేసుకోవాలి.

జనవరి 8, 2025 నుండి సెప్టెంబర్ 20, 2025 వరకు ప్రయాణానికి అవకాశం ఇస్తారు. జనవరి 5 వరకు చేసిన బుకింగ్‌లకు లైట్ ఆఫర్ కింద రూ .1,448, వాల్యూ ఆఫర్ కింద రూ .1,599 ధరలు ఉంటాయి. న్యూ ఇయర్ సేల్‌లో భా...