భారతదేశం, ఫిబ్రవరి 4 -- భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయి! ఇప్పుడు అందరి చూపు ఎస్​యూవీల వైపు మళ్లుతోంది. పెద్ద కారు ఉండాలనే కోరిక పెరగడం వల్ల ఈ సెగ్మెంట్ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. అయితే, సాధారణంగా ఎస్​యూవీలు పరిమాణంలో పెద్దవిగా ఉన్నప్పటికీ, లగేజీ పెట్టుకునే స్థలం (బూట్ స్పేస్) విషయంలో తరచూ రాజీ పడాల్సి వస్తుంటుంది. కానీ, మీరు ఎక్కువ లగేజీతో, ఫ్యామిలీ ట్రిప్స్​ కోసం తరచూ ప్రయాణించే వారైతే.. 2026లో అత్యధిక బూట్ స్పేస్‌ను ఆఫర్ చేస్తున్న ఈ 5 కాంపాక్ట్ ఎస్​యూవీలను ఖచ్చితంగా పరిశీలించాలి.

కాంపాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్‌లో లగేజీ స్పేస్ విషయంలో 'హోండా ఎలివేట్' రారాజు అని చెప్పవచ్చు. ఇది ఏకంగా 458 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను అందిస్తోంది.

ఇంజన్ అండ్​ పవర్: ఇందులో 1.5 లీటర్ ఐ-వీటెక్​ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 119.35 బీహెచ్​పీ పవర్, 145 ఎ...