భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓమెగా సైకి మొబిలిటీ (ఓఎస్​ఎం), ఇప్పుడు సామాన్యుల ప్రయాణ అవసరాలపై దృష్టి సారించింది. ఇప్పటివరకు కమర్షియల్ వాహనాలకే పరిమితమైన ఈ కంపెనీ, తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ 'ఓఎస్ఎం వెక్స్​ట్రా'ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 99,900గా నిర్ణయించింది.

పట్టణ ప్రాంతాల్లో నిత్యం ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్‌ను రూపొందించారు. ఇది గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ ఓఎస్​ఎం వెక్స్​ట్రాని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 110 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇంట్లోనే వాడుకునే ఛార్జర్‌తో కేవలం 4 గంటల్లోనే 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ నిండుతుంది. పూర్తి ఛార్జింగ్ క...