భారతదేశం, జనవరి 26 -- అమెరికాలో గుడ్ల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గుడ్డు ధరలు నిరంతరం ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో గుడ్లు డజనుకు 7 డాలర్లు(రూ.603) చొప్పున విక్రయిస్తున్నారు. గుడ్డు ఖరీదైనదిగా మారడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని డెమోక్రాట్ల నేతృత్వంలోని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. పెరుగుతున్న గుడ్ల ధరలను తగ్గించుకునేందుకు ట్రంప్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

'2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జో బిడెన్‌పై ట్రంప్ మాటలతో పదేపదే దాడి చేశారు. అయితే ధరలు పెరగకుండా నిరోధించడానికి ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రెసిడెంట్‌గా గెలిచి రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత కూడా కోడిగుడ్ల ధరలను తగ్గించేందుకు ట్రంప్ ఏమీ చేయడం లేదు.'అని డెమోక్రాట్లు అన్నారు.

కమోడిటీ ప్రైస్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం, అమెరికాలోని ...