భారతదేశం, ఫిబ్రవరి 3 -- థియేటర్లలో బ్లాక్​బస్టర్​ హిట్​ కొట్టిన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' సినిమా.. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో తన ఓటీటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఓటీటీలో కూడా ఈ స్పై థ్రిల్లర్​ దూసుకెళుతోంది. కాగా సినిమా ప్రారంభంలో కనిపించే క్రెడిట్స్‌లో ఒక ఊహించని పేరు ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. నిశితంగా గమనించే ప్రేక్షకులు రాజకీయ రంగానికి చెందిన ఒక సుపరిచితమైన పేరును క్రెడిట్స్‌లో చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎగ్జిక్యూటివ్​ ప్రొడ్యూసర్​గా రాహుల్​ గాంధీ పేరు ఉంది. ఇది ఇప్పుడు సోషల్​ మీడియాను ఊపేస్తోంది!

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా 'రాహుల్ గాంధీ' అనే పేరు కనిపించింది. దీనితో ఈ సినిమాలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రమేయం ఏమైనా ఉందా? అనే చర్చలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో ...