భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాజాగా చింతమనేని ప్రభాకర్ ఓ వ్యక్తిని బూతులు తిట్టిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఇష్యూ పోలీసు కేసుల వరకు వెళ్లింది. అటు వైసీపీ చీఫ్ జగన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ క్లారిటీ ఇవ్వడానికి సీఎం వద్దకు రాగా.. అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఇటీవల చింతమనేని ప్రభాకర్ ఓ శుభకార్యానికి వెళ్లారు. ఆయన వెళ్లడానికంటే ముందే.. తన రాజకీయ ప్రత్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి అక్కడ ఉన్నారు. అయితే.. ఫంక్షన్ హాల్‌కు వెళ్లే దారిలో అబ్బయ్య చౌదరి కారు ఉంది. తన కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదంటూ.. చింతమనేని ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు దిగి వచ్చి డ్రైవర్‌ను చెప్పలేని బూతులు తిట్టారు. దీనికి సంబ...