భారతదేశం, అక్టోబర్ 28 -- బంగాళాఖాతంలో మొంథా తుపాను తీవ్ర రూపం దాల్చింది! దీని ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు.. తీర ప్రాంతాల వెంబడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం.. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉంది.

థాయ్ భాషలో "సువాసనగల పువ్వు" అని అర్థం వచ్చే ఈ మొంథా తుపాను.. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది!

మొంథా తుపాను తీవ్ర ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది! వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. తీర ప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, గంటకు 90-110 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ఇండియన్ నేషనల్ సెంటర్ ఫ...