భారతదేశం, ఫిబ్రవరి 24 -- అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్' (సీయూఈటీ యూజీ 2026) దరఖాస్తు గడువును పొడిగించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). అర్హత ఉండి, గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ విండోను మళ్లీ ఓపెన్​ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అంతకుముందు సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్​ విండో ఫిబ్రవరి 4న క్లోజ్​ అయ్యింది.

చివరి తేదీ: సీయూఈటీ యూజీ 2026కి ఈ ఫిబ్రవరి 26 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఎడిట్ ఆప్షన్ ఉండదు: ఇది ప్రత్యేకంగా పొడిగించిన సమయం కాబట్టి, దరఖాస్తు ఫారమ్ సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలు (కరెక్షన్స్​) చేసుకునే అవకాశం ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. కాబట్టి, వివరాలన...