భారతదేశం, ఫిబ్రవరి 5 -- సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీ టెట్‌ - 2026 ఫిబ్రవరి సెషన్)కి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://ctet.nic.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 7, 8 తేదీల్లో దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరగనుంది.

రెండు షిఫ్టుల్లో సీ - టెట్ పరీక్ష జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

సీ టెట్ అడ్మిట్ కార్డులో ఏమైనా తప్పులు దొర్లితే ముందుగానే సరి చేసుకోవాలి. పేరు, ఫొటో, సంతకంతో పాటు ఇతర వివరాలకు సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే సీ-టెట్ అధికారులను సంప్రదించాలి. అధికారిక వెబ్ సైట్ ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు.

సీటెట్ క్వాలిఫై అయితే. దేశవ్యాప్తంగానూ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్ర...