భారతదేశం, మార్చి 15 -- Child Aadhaar Camps : రాష్ట్రంలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించ‌నున్నారు. రెండు విడ‌త‌లుగా నిర్వహించే ఈ క్యాంపులు, మార్చి 19 నుంచి మార్చి 22 వరకు మొద‌టి విడ‌త‌గా జ‌రుగుతాయి. రెండో విడ‌త‌గా మార్చి 25 నుంచి మార్చి 28 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల‌కు ఆధార్ న‌మోదుతో పాటు అప్‌డేట్ కూడా చేయించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

రాష్ట్రవ్యాప్తంగా 0-6 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల చిన్నారుల‌కు ఆధార్ న‌మోదు చేసేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపుల‌ను నిర్వహిస్తున్నట్లు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల శాఖ పేర్కొంది. తప్పనిసరిగా చిన్నారులకు ఆధార్ న‌మోదయ్యే విధంగా చ‌ర్యలు తీసుకోవాల‌ని అన్ని జిల్లాల క‌లెక్టర్లకు ఆ శాఖ డైరెక్టర్ శివ‌ప్రసాద్ సోమ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తం...