Hyderabad, మార్చి 29 -- లైంగికంగా యాక్టివ్‌గా ఉండటం ఆరోగ్యకరమైన అలవాటే. కానీ, తరచుగా శృంగారం చేసే వారిలో సుఖవ్యాధులు సంక్రమించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా మందిలో సుఖవ్యాధులు అనగానే సైఫిల్స్ లేదా గనేరియా, క్లమైడియా అనుకుంటారు. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో కనిపించే సమస్యలు కాబట్టి. వీటితో పాటు చాంక్రాయిడ్ అనే సమస్య కూడా వస్తుందట. చాలా అరుదుగా సంక్రమించే ఈ వ్యాధి నొప్పిని కలిగించడంతో పాటు ప్రమాదకరంగా కూడా మారొచ్చట. ఈ ఇన్ఫెక్షన్ పెరిగి హెచ్ఐవీ ట్రాన్స్‌మిషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇందులో ఒక సంతోషకరమైన వార్తేమిటంటే, దీనిని యాంటీబయాటిక్స్‌తో తగ్గించుకోవచ్చు.

బ్యాక్టీరియం హేమోఫిలస్ డుక్రెయి కారణంగా ఈ సుఖవ్యాధి సంక్రమిస్తుంది. దీని కారణంగా ప్రైవేట్ పార్ట్స్‌లో చర్మం ఇన్ఫెక్షన్‌కు గురవుతుంది. ఇంకా జననాంగాల్లో ద్రవాలు పెరి...