భారతదేశం, ఏప్రిల్ 13 -- CBSE Board Result 2024: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2024 సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను త్వరలోనే ప్రకటించనుంది. ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. 10, 12 తరగతుల ఫలితాలు cbse.nic.in, results.cbse.nic.in వెబ్ సైట్స్ లో కూడా అందుబాటులో ఉంటాయి. ఫలితాలను తనిఖీ చేయడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. అలాగే, డిజిలాకర్ వెబ్సైట్, డిజిలాకర్ మొబైల్ యాప్, ఉమంగ్ మొబైల్ యాప్ ల్లో కూడా రిజల్ట్ చూసుకోవచ్చు.

ఈ ఏడాది సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను 2024 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను 2024 ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. అన్ని పరీక్షలను ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఒకే షిఫ్టులో నిర్వహించారు.

సీబీఎస్ఈ బోర...