భారతదేశం, ఫిబ్రవరి 1 -- మరో కీలక ఘట్టానికి దేశం సన్నద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంకొన్ని గంటల్లో 'బడ్జెట్ 2026'ను సమర్పించనున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది ఇదే తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడం మనకు అలవాటే అయినా.. ఈసారి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రావడం విశేషం. దీనితో సెలవు రోజున బడ్జెట్ ప్రవేశపెడుతున్న అరుదైన సందర్భానికి దేశం సాక్ష్యం కాబోతోంది. అంతేకాదు, వరుసగా తొమ్మిది పూర్తి స్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ గుర్తింపు పొందబోతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక దిశానిర్దేశం చేయనుంది. ప్రభుత్వ వ్యయంలో ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే.. దేశ వృద్ధికి, ఉపాధి కల్పనకు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభవాన్ని పెంచేందుకు అవసరమైన వ్యూహాత్మక చర్యలను ప్రభుత్వం ఎలా ...