భారతదేశం, ఫిబ్రవరి 20 -- బిర్లా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ అండ్​ సైన్స్​ (బిట్స్​) పిలానీ సంచలన ప్రకటన చేసింది! బిట్​సాట్​ 2026 పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 500 మంది ర్యాంకర్లకు ఉచిత విద్యను అందించబోతున్నట్టు వెల్లడించింది

బిట్​సాట్​ 2026 పరీక్షలో మొదటి 500 ర్యాంకులు సాధించి, 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందే విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రయోజనం వారు చదివే నాలుగేళ్ల ఫస్ట్-డిగ్రీ ప్రోగ్రామ్ మొత్తానికి వర్తిస్తుంది.

ఆదాయ పరిమితి: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 20 లక్షల వరకు ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు.

అకాడమిక్ నిబంధన: ఈ స్కాలర్‌షిప్‌ను కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగించాలంటే, విద్యార్థులు తమ తమ క్యాంపస్‌లలో కనీసం 7.5 సీజీపీఏ నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.

బిట్స్ పిలానీ గ్...