భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఆదిలాబాద్‌లో చికెన్‌ మార్కెట్‌ బంద్‌ కానుంది. వారంపాటు బంద్‌ చేస్తున్నట్టు వ్యాపారులు ప్రకటించారు. బర్డ్‌ ఫ్లూ భయంతో చికెన్‌ అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారం లేక చికెన్‌ మార్కెట్‌ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. వారం తర్వాత పరిస్థితిని చూసి మార్కెట్ ఓపెన్ చేస్తామని అంటున్నారు వ్యాపారులు. తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ భయం లేదని చెప్పినా.. ప్రజలు కొనడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.

తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్టు అధికారిక ప్రకటన రాలేదు. మన పక్కనున్న ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఏపీలోనూ బర్డ్‌ ఫ్లూ పూర్తిగా అదుపులోనే ఉందని.. ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.దామోదర నాయుడు వెల్లడించారు. బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ జరిగిన తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమ...