భారతదేశం, మార్చి 28 -- Bank holidays: మార్చి 30, 31 తేదీల్లో ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన ఓవర్ ది కౌంటర్ లావాదేవీలకు అన్ని ఏజెన్సీ బ్యాంకులు తెరిచి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. "2023-24 ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో అన్ని ప్రభుత్వ లావాదేవీల కోసం మార్చి 31, 2024 (ఆదివారం) న ప్రభుత్వ లావాదేవీలు జరిగే అన్ని ఏజెన్సీ బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని ఆర్బీఐ బ్యాంక్ లకు సూచించింది. దీని ప్రకారం, ఏజెన్సీ బ్యాంకులు 2024 మార్చి 31 న (ఆదివారం) ప్రభుత్వ వ్యాపారాలతో వ్యవహరించే అన్ని శాఖలను తెరిచి ఉంచాల్సి ఉంటుంది.

ఆర్బీఐ (RBI) వెబ్ సైట్ ప్రకారం, "ఆర్బీఐ తన సొంత కార్యాలయాలతో పాటు, తన ఏజెంట్లుగా నియమించుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాల సాధారణ బ్యాంకింగ్ వ్యాపారాలను నిర్వహిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇ...