భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఆర్టిఫీషీయల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) ప్రభావం రోజురోజుకు పెరుగుతూ, కోట్లాది మంది ఉద్యోగులపై "లేఆఫ్స్"​ భారం పడుతున్న తరుణంలో.. జోహో కో-ఫౌండర్​ శ్రీధర్​ వెంబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఐటీ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా కోడింగ్​ చేసే వారు (తనతో సహా) ఇక వేరే ఉపాధిని వెతుక్కోవాలని సూచించారు. కోడింగ్‌లో ఒక్క లైన్ కూడా తెలియకపోయినా, కేవలం ఏఐని ఉపయోగించి ఓ వ్యక్తి 'భగవద్గీత' యాప్‌ను అభివృద్ధి చేయడంపై వేంబు ఈ మేరకు స్పందించారు.

"నాకు రోజు భగవద్గీత చదవాలని ఉండేది. కానీ దానికి సరైన యాప్​ దొరకలేదు. అందుకే నేను సొంతంగా తయారు చేసుకున్నా. అసలు కోడింగ్​లో సింగిల్​ లైన్​ కూడా రాయలేని నేను వారంలో ఐఓఎస్​ యాప్​ని తయారు చేశాను," అని అనిశ్​ మూంకా అనే వ్యక్తి తన ఎక్స్​ అకౌంట్​లో పోస్ట్​ చేశారు.

దీనిపై శ్రీధర్​ వెంబ...