భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC), ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(OMCAP) భాగస్వామ్యంతో, ట్రాన్స్‌మిషన్ లైన్ టెక్నీషియన్ల కోసం జర్మనీలో నైపుణ్యం ఆధారిత ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఒక అంతర్జాతీయ ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించింది.

తాజాగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఏపీఎస్ఎస్‌డీసీ ఏలూరు జిల్లా అధికారి జితేంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నుండి అనుభవం ఉన్న ట్రాన్స్‌మిషన్ లైన్ టెక్నీషియన్లకు విదేశాలలో ఉపాధి కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమం కింద ఎలక్ట్రీషియన్ సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ అర్హతలు కలిగి కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉన్న పురుష, మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థుల వయస్సు 43 సంవత్సరాలలోపు ఉండాలి. వార...