భారతదేశం, ఏప్రిల్ 10 -- Adilabad Water Crisis: ఆదిలాబాద్‌లో నీటి కొరత తీవ్రమైంది. గత నెలతో పోల్చితే సగ టున ఒక మీటరు మేర దిగువకు దిగజారింది. 4 మీటర్ల ద్వారా నీటి లెక్కింపు చేసి నివేదిక విడుదల చేయగా.. వివిధ మండలాల్లో పది మీటర్ల కంటె ఎక్కువగా జలం పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. నీటిని పొదుపు చేయకుండా అవసరానికి మించి వాడటంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. నిరంతర విద్యుత్తు సరఫరాతో మోటార్ల ద్వారా ఎక్కువ నీటిని వినియోగిస్తుండటంతో గతంలో ఎన్నడూలేని విధంగా నీటి మట్టం పడిపోతుం డటం ప్రమాద సంకేతాన్ని సూచిస్తోంది.

కష్టకాలంలో సాగు, తాగు నీటికి ఆసరాగా ఉంటాయని భావించిన జలాశయాలు కూడా వట్టిపోతుండటం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని పలు సాగు నీటి ప్రాజెక్టుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పడిపో వడంతో రబీ పంటలక...