భారతదేశం, జూన్ 18 -- వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తోంది చైనాకు చెందిన 92 ఏళ్ల లీ అనే బామ్మ. హునాన్ ప్రావిన్స్‌కు చెందిన ఈ బామ్మ తన కఠినమైన వ్యాయామ దినచర్యతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోజుకు 200 పుష్-అప్‌లు, 100 సిట్-అప్‌లతో ఆమె ఫిట్‌నెస్ రహస్యం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.

లీ తన ఉదయం పూట చేసే వ్యాయామ దినచర్యలో భాగంగా 200 పుష్-అప్‌లు, 100 సిట్-అప్‌లు మాత్రమే కాకుండా, హులా-హూప్ కూడా తిప్పుతుంది. క్రమశిక్షణ, ఆటవిడుపు, సహజమైన పద్ధతులతో లీ తన శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల సీనియర్ సిటిజెన్లు ఎలా ఉండాలనే దానిపై కొత్త ఆలోచనలకు నాంది పలుకుతోంది. 92 ఏళ్ల బామ్మ 30 ఏళ్ల వారి కంటే ఎలా ఫిట్‌గా ఉంటుందో తెలుసుకుందాం.

'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' ప్రకారం, తొంభైలలో ఉన్న లీ, ఇరవైలు లేదా ముప్పైలలో ఉన్న చాలా మందికి కూడా కష్టంగా అనిపించే వ్యాయామాల...