భారతదేశం, జూలై 23 -- 8 వసంతాలు.. ఈ మధ్యకాలంలో చూసిన త్రిభాష సినిమాల్లో చాలా నచ్చిన సినిమా. అప్పట్లో గీతాంజలి, ప్రేమ, మజ్ను, అభినందన, నీరాజనం లాంటి అద్భుతమైన ప్రేమ చిత్రాలు వచ్చాయి. పూర్తిగా అలాంటిదే కాకపోయినప్పటికీ ప్రేమ భావాన్ని చాలా హృద్యంగా చిత్రీకరించిన చిత్రంగా చెప్పొచ్చు.

కథ విషయానికి వస్తే ప్రేమ చుట్టూనే కథంతా తిరుగుతుంది. కానీ ఆ ప్రేమ ఒక అమ్మాయి ప్రేమ, అది కూడా ఒక ఆత్మస్థైర్యం నిండుగా గల అమ్మాయి కి అంతే మెండుగా భావవ్యక్తీకరణ మనసు ఉంటే ఎలా ఉంటుంది అనేది దర్శకుడు ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించాడు.

కథనం, పాత్రలు తీసుకుంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అంటే కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు అని అంటుంటాం కదా, కథానాయిక ప్రాధాన్యం అంటే హీరోయిన్ కి ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండి ప్రస్తుతం ఏదో అద్భుతాలు చేసే చిత్రాలుగా ఇప్పటివరకు చాలా వచ్చాయి....