భారతదేశం, డిసెంబర్ 12 -- రియల్​మీ సంస్థ తన ప్రతిష్టాత్మక రియల్​మీ 16 ప్రో స్మార్ట్​ఫోన్​ని త్వరలోనే ఇండియాలో విడుదల చేయనుంది.​ ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్లను కంపెనీ ఇప్పటికే సోషల్ మీడియాలో రిలీజ్​ చేసింది. అంతేకాకుండా, అధికారిక వెబ్‌సైట్‌లోని మైక్రోసైట్​ని లైవ్​లోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రియల్‌మీ ఈ కొత్త ఫోన్ కెమెరా వివరాలు, ఇందులో ఉండే అప్‌గ్రేడ్‌లు వంటి ముఖ్యమైన అంశాలను కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రియల్‌మీ 16 ప్రోలో తెలుసుకోవాల్సిన 7 ముఖ్య విషయాలను ఇక్కడ చూసేయండి..

1. కెమెరా ఫోకల్ లెంగ్త్‌లు

రియల్‌మీ వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్​ఫోన్ 1x, 3.5x, 10x వంటి వివిధ రకాల పోర్ట్రెయిట్ ఫోకల్ లెంగ్త్‌లను అందిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం, రియల్‌మీ 16 ప్రోలో 200ఎంపీ ప్రధాన కెమెరా ఉండవచ్చు. దీనికి 8ఎంపీ అల్ట్...