భారతదేశం, ఫిబ్రవరి 2 -- బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ఫ్యాషన్ సెన్స్‌కు సాటిలేరు. ముఖ్యంగా సంప్రదాయ దుస్తుల్లో ఆమె ఒలికించే గ్రేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ 58 ఏళ్ల నటి మరోసారి తన అద్భుతమైన స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతున్న వేళ, ఫ్యాషన్ ప్రియులకు ఇన్పిరేషన్ ఇచ్చేలా అదిరిపోయే బాటిల్ గ్రీన్ చీరలో ఆమె మెరిసిపోయారు.

జనవరి 31న మాధురీ దీక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. 1965 నాటి క్లాసిక్ సినిమా 'గైడ్'లోని 'పియా తోసే నైనా లాగే రే..' అనే హిట్ సాంగ్‌ను క్యాప్షన్‌గా జోడించి, తన లుక్‌కు మరింత అందాన్ని తీసుకువచ్చారు. రిచ్ బాటిల్ గ్రీన్ రంగులో ఉన్న ఈ పట్టు చీర ఆమెకు రాజసం తెచ్చిపెట్టింది. చీర అంచు వెంబడి జరిపిన జర్దోసీ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ అవుట్‌ఫిట్‌కు హైలెట్‌...