భారతదేశం, ఫిబ్రవరి 4 -- పిల్లల ప్రాణాలు కాపాడటం కోసం ఓ అంగన్‌వాడీ వర్కర్​ తన ప్రాణాలనే పణంగా పెట్టింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా రణ్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. కన్నతల్లి ప్రేమను మించిన సాహసంతో ఆమె చేసిన పోరాటం ఆ ఊరి పిల్లలకు పునర్జన్మ నిచ్చింది. కానీ ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయింది.

మాడవదా పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో పిల్లలంతా ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక్కసారిగా తేనెటీగల దండు ఆ పిల్లలపైకి దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో అర్థం కాక పిల్లలు హాహాకారాలు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వంట మనిషి కంచన్ బాయి మేఘవాల్ ఏమాత్రం ఆలోచించలేదు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినా వెనకాడలేదు.

దగ్గరలో ఉన్న టార్పాలిన్ పట్టాలు, చాపలను తీసుకుని ఒక్కో పిల్లలని వాటితో కప్...