భారతదేశం, డిసెంబర్ 25 -- ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు యాపిల్​ సంస్థ సరికొత్తగా పరిచయం చేసిన 'ఐఫోన్ ఎయిర్' ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తోంది. లాంచ్ సమయంలో రూ. 1,19,900 ఉన్న ఈ ఫోన్ ధర, ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్లతో 15శాతం మేర తగ్గింది. కేవలం స్టైల్ కోసమే కాకుండా, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప డీల్ అని టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఐఫోన్ ఎయిర్​ ధర ఎంఆర్‌పీ కంటే సుమారు రూ. 7,000 తక్కువగా అంటే రూ. 1,12,900 వద్ద లిస్ట్ అయింది. దీనికి తోడు రూ. 8,000 విలువైన డిస్కౌంట్ కూపన్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఏదైనా ప్రముఖ బ్యాంకు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే అదనంగా మరో రూ. 4,000 నుంచి 5,000 వరకు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా దాదాపు రూ. 19,000 వరకు తగ్గింపుతో ఈ లేటెస్ట్ ఐఫోన్ మీ సొం...