భారతదేశం, నవంబర్ 12 -- గతంలో హీరో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. స్వయంగా హీరో నాగార్జున కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అంతేకాకుండా.ఆమెపై పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశారు. ఈ కేసులో పలుమార్లు సురేఖ హాజరయ్యారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే అనూహ్యంగా మంత్రి కొండా సురేఖ మంగళవారం రాత్రి తర్వాత ఓ ప్రకటన చేశారు. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విట్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.

హీరో నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని తె...