భారతదేశం, నవంబర్ 24 -- దేశంతో పాటు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కు చెందిన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధి అనంత్. ఆయుధాలు వీడాలన్న తమ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా నిర్ణయానికి మద్దతిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో వెల్లడించారు.

"ఆయుధాలు పక్కన పెట్టాలన్న నిర్ణయానికి మేము మద్దతు ఇస్తున్నాము. సీసీఎం సతీష్ దాదా తర్వాత, మరొక సీసీఎం కామ్రేడ్ చంద్రన్న (సరెండర్) ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. మేము, ఎంసీసీ స్పెషల్ జోనల్ కమిటీ కూడా ఆయుధాలను విడిచిపెట్టి, ...