Telangana,andhrapradesh, జూన్ 19 -- ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నీళ్ల వివాదం షురూ అయింది. ఇప్పటికే పలు ప్రాజెక్టుల విషయంలో వివాదాలు కొనసాగుతుండగా. తాజాగా బనకచర్ల ప్రాజెక్ట్ తో నేతల మధ్య మాటలు పేలుతున్నాయి. ఇదే విషయంపై గత కొంత కాలంగా ప్రతిపక్ష బీఆర్ఎస్. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ సర్కార్ జల దోపిడికి దిగుతుంటే. ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నిస్తోంది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా కూడా వివరాలను ప్రజల ముందు వచ్చే ప్రయత్నాలు కూడా చేసింది.

ఏపీ సర్కార్ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ పై భారీ పోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పాటు కేంద్రంలోని బీజేపీపై పోరాటం చేయాలని చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తోందని. ...