Telangana,hyderabad, ఆగస్టు 7 -- గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ లీక్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. కేసీఆర్ చుట్టు దెయ్యాలు ఉన్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు. హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. లీఖను లీక్ చేసిన వారి పేర్లను బయటిపెట్టాలని. పార్టీని ప్రక్షాళన చేయాలంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీకి దూరంగా ఉంటున్న కవిత.. జాగృతి సంస్థ పేరుతో యాక్టివ్ గా కార్యక్రమాలు చేపడుతున్నారు.

వరంగల్ సభ తర్వాత కవిత. పార్టీ అధినేత కేసీఆర్ కు రహస్య లేఖ రాశారు. అయితే ఈ లేఖ బయటికొచ్చింది. ఈ విషయాన్ని కవిత తీవ్రంగా పరిగణించారు. పార్టీలోని కొంత మంది కోవర్టులు.లేఖను బయటపెట్టారని ఆరోపించారు. కేసీఆర్ దేవుడని.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్నుంచి ఆమె పార్...