భారతదేశం, జూన్ 22 -- ఇల్లు కొనేందుకు రుణాలిచ్చే ముందు అన్ని విధాలా సరి చూసుకోవాలని బ్యాంకర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. IOV హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో "ట్రాన్స్ఫార్మేటివ్ ఎరాలో వాల్యుయేషన్" అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా రంగనాథ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.

గతేడాది జులై 19న హైడ్రా ఏర్పడిందని రంగనాథ్ గుర్తు చేశారు. అంతకు ముందు వెలసిన నివాస ప్రాంతాలతో పాటు.. అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న వాటి జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత అక్రమ కట్టడాలు వస్తే వాటిని తొలగిస్తామన్నారు. హైడ్రా అంటే కూల్చవేతలు కాదన్నారు. పర్యావరణ హితమైన నగరాభివృద్ధికి దోహదం చేసే సంస్థగా అందరూ గుర్తిస్తున్నారన్నారు. సుస్థిర వ్యాపారానికి హైడ్రా దోహదం చేస్తోందని అందరూ గ్రహిస్తున్నారు.

ఎలాంటి మోసాలకు ...