భారతదేశం, మార్చి 12 -- ‍Narsampet Dispute: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ అసైన్డ్ ల్యాండ్ వివాదం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య చిచ్చు రేపింది. కొంతకాలంగా ఆ భూమి విషయంలో వివాదం నడుస్తుండగా.. మంగళవారం రెండు పార్టీల నాయకుల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో ఒక వర్గంపై మరో వర్గం నేతలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా.. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాల నేతలను చెదరగొట్టే ప్రయత్నం చేయగా.. రెండు వర్గాల ఘర్షణలో ఓ ఎస్సై కూడా గాయపడ్డారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నర్సంపేట పట్టణ పరిధిలోని మాదన్నపేట రోడ్డులో ఉన్న 111 సర్వే నెంబర్ లో దాదాపు నాలుగు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. అది ఓ మాజీ సైనిక అధికారికి చెంది...