Hyderabad,telangana, జూన్ 28 -- తెలుగు న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) సూసైడ్ చేసుకుంది. శుక్రవారం హైదరాబాద్ లోని చిక్కడపల్లిలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్వేచ్ఛా ప్రస్తుతం టీ న్యూస్ లో న్యూస్ ప్రెజెంటర్ గా పని చేస్తున్నారు. గతంలోనూ ప్రముఖ తెలుగు టీవీ ఛానెళ్లలో పని చేశారు. ఆమెకు ఓ కుమార్తె కూడా ఉంది. శుక్రవారం సాయంత్రం కుమార్తె పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చి చూడగా బెడ్ రూమ్ డోర్ లాక్ అయి ఉండటాన్ని గమనించింది. పలుమార్లు తట్టినా స్పందన లేకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. డోర్ తీసి చూడగా. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.

స్వేచ్ఛాకు గతంలో వివాహం కాగా.భర్తతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం కుమార్తెతో...